రహదారి నిర్మాణం చేపట్టాలంటూ వినతి

రహదారి నిర్మాణం చేపట్టాలంటూ వినతి

NRML: నిర్మల్ మండలం మేడిపల్లి నుంచి ఎల్లారెడ్డిపేట గ్రామం వరకు రహదారి నిర్మాణం చేపట్టాలని మాజీ సర్పంచులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఆదివారం డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుకు వినతిపత్రం అందజేశారు. రహదారి దయనీయ స్థితిలో ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని డీసీసీ వారికి హామీ ఇచ్చారు.