'పిల్లల దత్తతపై ప్రజలలో అవగాహన తీసుకురండి'

'పిల్లల దత్తతపై ప్రజలలో అవగాహన తీసుకురండి'

AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం పిల్లల దత్తతపై అంగన్వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ సువార్త మాట్లాడుతూ.. అనాధ పిల్లలను దత్తత తీసుకునే విషయం మీద ప్రజలలో అవగాహన తీసుకురావాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్ల పరిధిలో ప్రతి ఒక్కరికి దత్తత నిబంధనలు తెలియజేయాలని పేర్కొన్నారు.