VIDEO: MJP పాఠశాలను సందర్శించిన మంత్రి సవిత
సత్యసాయి: పెనుకొండ మండలం రాంపురం MJP పాఠశాలను మంత్రి సవిత గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. భోజనాన్ని స్వయంగా రుచి చూసి విద్యార్థులకు వడ్డిస్తూ వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని పాఠశాల సిబ్బందికి సూచించారు.