పోలీస్ ప్రజా సమస్యల వేదికలో 83 ఫిర్యాదులు స్వీకరణ

నంద్యాల జిల్లా బొమ్మలసత్రం పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక జరిగింది. ఈ సందర్భంగా 83 ఫిర్యాదులు స్వీకరించారు. ఫిర్యాదులను చట్ట పరిధిలో నిర్ణీత గడువులో పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కుటుంబ కలహాలు, భూవివాదాలు, మోసాలు వంటి అంశాలపై ప్రజలు ఫిర్యాదులు చేశారు.