తెనాలిలో మున్సిపల్ కమిషనర్ పదవీ విరమణ సభ

తెనాలిలో మున్సిపల్ కమిషనర్ పదవీ విరమణ సభ

GNTR: తెనాలి మున్సిపల్ కమిషనర్ లక్ష్మీపతి పదవీ విరమణ సందర్భంగా మున్సిపల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ శనివారం వీడ్కోలు సభ నిర్వహించింది. ఈ కార్యక్రమం కళాక్షేత్రంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, లక్ష్మీపతి దంపతులను సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఆర్డీ సూర్యదేవర హరికృష్ణ, ఛైర్‌పర్సన్ రాధిక పాల్గొన్నారు.