'రన్ ఫర్ యూనిటీ'లో చిరంజీవి
TG: దేశమంతా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ ఏక్తా దివస్‌ను ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మొత్తం ఏడు చోట్ల 'రన్ ఫర్ యూనిటీ'ని విజయవంతంగా నిర్వహించారు. పీపుల్స్ ప్లాజాలో జరిగిన కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి పోలీసులతో కలిసి రన్నింగ్‌లో పాల్గొన్నారు.