ఉద్యోగం ఇప్పిస్తానని మోసం.. వ్యక్తి అరెస్ట్
KRNL: అవుట్‌సోర్సింగ్, ప్రైవేట్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రజల నుంచి రూ.1.5 లక్షల వరకు వసూలు చేసిన వ్యక్తిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు నకిలీ నియామక ఉత్తర్వులు పంపి పలువురిని మోసం చేసినట్టు DSP జె. బాబు ప్రసాద్ తెలిపారు. ఇలాంటి దళారుల మాటలు నమ్మవద్దని, ఉద్యోగాల పేరుతో డబ్బులు ఇవ్వకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.