చెట్టును ఢీకొన్న బైక్ .. ఇద్దరు మృతి

చెట్టును ఢీకొన్న బైక్ .. ఇద్దరు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మలహర్‌రావు మండలం రుద్రారం- చిగురుపపల్లి గ్రామాల సరిహద్దులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు చెట్టును ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.