తుంగభద్ర డ్యామ్‌ను సందర్శించిన మంత్రి పయ్యావుల
ATP: తుంగభద్ర జలాశయాన్ని మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మంగళవారం సందర్శించారు. డ్యామ్‌లో ఏర్పాటు చేస్తున్న 32 కొత్త గేట్ల పనులను టీబీ డ్యాం ఉన్నతాధికారులతో కలిసి వారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కర్ణాటక జలవనరుల శాఖ సిబ్బంది, ఇంజనీర్లతో పనుల పురోగతిపై చర్చించారు. పనులు త్వరగా పూర్తి చేయాలని సూచించారు.