మాచవరంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

PLD: మాచవరం మండల విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. బ్రిటిష్ పాలన నుంచి దేశానికి స్వాతంత్య్ర తీసుకురావడానికి ఎందరో నాయకులు తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తుచేశారు. కాగా, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.