కొలంబోకు భారత్ మానవతా సాయం
శ్రీలంకను దిత్వా తుఫాన్ వణికిస్తోంది. వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఇప్పటికే 123 మంది చనిపోయారు. మరో 34 మంది ఆచూకీ గల్లంతైంది. తుఫాన్‌తో అతలాకుతలమవుతున్న కొలంబోను ఆదుకునేందుకు భారత ముందుకొచ్చింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరిట ప్రత్యేక కార్గో విమానాల్లో టెంట్లు, టార్పాలిన్లు, దుప్పట్లు, పరిశుభ్రత కిట్లు, ఆహార పదార్థాలను పంపించింది.