ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన చెందొద్దు: కలెక్టర్

కోనసీమ: జిల్లాలో ఎరువుల లభ్యతపై రైతులు ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పేర్కొన్నారు. యూరియా సరఫరా సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే రూ.20 వేల యూరియా బస్తాలు జిల్లాకు చేరాయన్నారు. రైతులకున్న అపోహలు తొలగించాలని స్థానిక అధికారులను ఆదివారం ఆయన ఆదేశించారు.