ఉచిత విద్యుత్‌కు ఈనెల 15 వరకే లాస్ట్ ఛాన్స్

ఉచిత విద్యుత్‌కు ఈనెల 15 వరకే లాస్ట్ ఛాన్స్

KDP: చేనేత, మరమగ్గాల కార్మికులకు ఉచిత విద్యుత్ పొందేందుకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు సంబంధిత గ్రామ లైన్ మెన్ / సచివాలయ సిబ్బందికి దరఖాస్తులు సమర్పించాలని జిల్లా చేనేత జౌళి శాఖ AD శ్రీదేవి సూచించారు. గడువు లోపల దరఖాస్తులు అందజేసి పథకం ప్రయోజనం పొందాలని ఆమె కార్మికులకు విజ్ఞప్తి చేశారు.