భారత సైన్యంలోకి ఎంపికైన ప్రభుత్వ హాస్టల్ విద్యార్థి
E.G: తణుకు మండలం పైడిపర్రు ప్రభుత్వ వసతి గృహంలో ఉంటూ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న తానేటి రత్నకుమార్ భారత సైన్యంలో ఎంపికయ్యారు. ఇటీవల జరిగిన అగ్నివీర్ -2025 రిక్రూట్‌మెంట్ ద్వారా ఎంపికైన రత్న కుమార్‌ను జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎన్.వి.అరుణకుమారి, తణుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారి ప్రసాద్, హాస్టల్ వెల్ఫేర్ అధికారి ఫణికుమార్, రామకృష్ణ అభినందించారు.