ఐదుగురికి 14 రోజులు రిమాండ్

ఐదుగురికి 14 రోజులు రిమాండ్

BDK: పాల్వంచ కిన్నెరసాని డీర్ పార్కులో విద్యుత్ తీగలతో దుప్పులను వేటాడటానికి ప్రయత్నించిన ఐదుగురికి కొత్తగూడెం ఇంఛార్జ్ న్యాయమూర్తి బి. రవికుమార్ నిన్న 14 రోజుల రిమాండ్ విధించారు. యానంబైలు, కిన్నెరసాని గ్రామాలకు చెందిన ఈ ఐదుగురు సోమవారం అర్ధరాత్రి పార్కులో దుప్పులను వేటాడేందుకు ప్రయత్నించారు. వారిని భద్రాచలం సబ్‌జైలుకు తరలించారు.