ప్రభుత్వ పాఠశాలలో భగత్ సింగ్ వర్ధంతి

ప్రభుత్వ పాఠశాలలో భగత్ సింగ్ వర్ధంతి

మహబూబ్‌నగర్: ఫరూఖ్ నగర్ మండలం రాసుమల్లగూడ పాఠశాలలో భగత్ సింగ్ 93వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు భగత్ సింగ్ జీవితం, భారత స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగం గురించి ఉపాధ్యాయులు వివరించారు. అనంతరం విద్యార్థులచే "భారత విద్యార్థులం.. భగత్ సింగ్ తమ్ములం" అనే పాటను ఆలపింపచేసి వారిలో స్ఫూర్తిని నింపారు. ఈ వేడుకలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.