పొదలకూరులో జోరుగా నకిలీ సిగరెట్ల విక్రయాలు

NLR: పొదలకూరు పట్టణంలో బ్రాండెడ్ ముసుగులో నకిలీ సిగరెట్ల విక్రయం జోరుగా సాగుతోంది. బిహార్, గుజరాత్, యూపీ, మయన్మార్ నుంచి ఈ ఫేక్ సిగరెట్లను ఇక్కడికి తెస్తున్నారు. కొరియర్ సంస్థలు నిబంధనలు పాటించకపోవడంతో అక్రమ రవాణా పెరిగింది. తెల్లవారుజామున శివారుల్లో సరుకు దిగుతుండగా, ఆటోల్లో దుకాణాలకు చేరుతోంది.