VIDEO: ఘరానా దొంగలను పట్టుకున్న లాలాపేట పోలీసులు
గుంటూరు ఐపీడీ కాలనీలో తాళం వేసిన ఇంటిలో గంటన్నర వ్యవధిలో 246 గ్రాముల బంగారం, 1,60,000 రూపాయల నగదు అపహరించిన ఇద్దరు వ్యక్తులను లాలాపేట పోలీసులు అరెస్టు చేశారు. విమానంలో వచ్చి దొంగతనం చేసి ట్రైన్‌లో ప్రయాణించడం వీరి ప్రధాన అలవాటని విచారణలో తేలినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఇద్దరు ముద్దాయిలను రిమాండ్‌కు తరలించారు.