ప్రజావాణికి 154 దరఖాస్తులు
కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’కి 154 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజల సమస్యలను స్వయంగా స్వీకరించిన కలెక్టర్, ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ విన్నపాలను ఏమాత్రం జాప్యం చేయకుండా, నిబంధనల ప్రకారం తక్షణమే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.