కల్వర్టు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్

కల్వర్టు పనులకు భూమి పూజ చేసిన సర్పంచ్

ADB: ఇంద్రవెల్లి (M) కేస్లాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కేస్లాగూడ గ్రామంలో బ్రిడ్జ్ కల్వర్టు పనులకు సర్పంచ్ మెస్రం తుకారాం నిన్న భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా ఈ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పటేల్ జ్యోతిరామ్, గంగారాం పటేల్, రామారావు కటోడ, తదితరులు పాల్గొన్నారు.