ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న టీడీపీ నేత

NLR: దగదర్తి మండలం వెలిపోడు పంచాయతీ కామినేనిపాలెంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు, మాలేపాటి సుధాకర్‌లతో కలిసి మంగళవారం ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే వర్షా కాలాన్ని దృష్టిలో ఉంచుకొని, ఇంటి పైకప్పుల మరమ్మతులకు అవసరమైన రేకులను అందజేస్తామని పలువురికి హామీ ఇచ్చారు.