టౌన్ ప్లానింగ్ ఉద్యోగులతో కమిషనర్ సమావేశం

VZM: బొబ్బిలి మున్సిపల్ కమిషనర్ ఎల్. రామలక్ష్మి సోమవారం తన కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో భవన నిర్మాణాలపై దృష్టి పెట్టి, అక్రమ నిర్మాణాలు జరిగితే చర్యలు తీసుకోవాలని సూచించారు. రోడ్లపై భవన నిర్మాణ సామగ్రి లేకుండా చూడాలన్నారు. ఈ సమావేశంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.