ఉత్తమ ప్రతిభా కనబరిచిన విద్యార్థినికి డీఈవో ప్రశంసలు

10వ తరగతి పరీక్ష ఫలితాలలో 597 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 2 ర్యాంకు సాధించిన హరిపురం జడ్పీహెచ్ఎస్ విద్యార్థిని కే.జోషితను జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్ తిరుమల చైతన్య అభినందించారు. ఆదివారం విద్యార్థిని జోషిత స్వగృహానికి చేరుకొని పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. ఆయన వెంట మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మణరావు, ఉపాధ్యాయ బృందం ఉన్నారు.