పాము కాటుతో మహిళ మృతి

BDK: పినపాక మండలం పాతరెడ్డిపాలెంకు చెందిన పప్పుల మహాలక్ష్మి శనివారం పొలంలో గడ్డి కోస్తుండగా పాము కాటుకు గురైంది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను పినపాక ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.