వ్యవసాయ కోర్సులకు చివరి విడత కౌన్సెలింగ్

వ్యవసాయ కోర్సులకు చివరి విడత కౌన్సెలింగ్

గుంటూరు: ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కళాశాలల్లో అగ్రి బీఎస్సీ (ఆనర్స్), బి. టెక్ (ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కౌన్సెలింగ్ తేదీలు వెల్లడయ్యాయి. చివరి విడత మాన్యువల్ కౌన్సెలింగ్ ఈనెల 3, 4వ తేదీల్లో, స్పాట్ కౌన్సెలింగ్ 5న నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.వి. రమణ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.