ఈ నెల 25 నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు
అన్నమయ్య: రాయచోటి పట్టణం త్యాగరాజు వీధిలోని పట్టాభి రామాలయంలో మార్చి 25 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబును నిర్వాహకులు కలిసి ఆహ్వానపత్రిక శుక్రవారం అందజేశారు. ఉత్సవాలకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో త్యాగరాజు వీధి భక్తులు, నాయీ బ్రాహ్మణులు పాల్గొన్నారు.