చెత్త సేకరణ ట్రాక్టర్లు ప్రారంభం

చెత్త సేకరణ ట్రాక్టర్లు ప్రారంభం

AKP: నాతవరం మండలంలో ఐదు గ్రామ పంచాయతీలకు నూతన చెత్త సేకరణ ట్రాక్టర్లు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎంపీడీవో ఎంఎస్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకుడు రాజాన వీరసూర్యచంద్ర, ఎంపిపి సాగిన లక్ష్మణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. గ్రామాల పరిశుభ్రత మెరుగుపడేందుకు ఇవి ఉపయోగపడతాయని తెలిపారు. స్వచ్ఛ ఆంధ్ర లక్ష్య సాధనకు భాగస్వాములు కావాలన్నారు.