'DYFI యువ చైతన్య సైకిల్ యాత్రను జయప్రదం చేయండి'

NLG: ఏప్రిల్ 14 నుంచి 20 వరకు DYFI యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే యువ చైతన్య సైకిల్ యాత్రను జయప్రదం చేయాలని DYFI జిల్లా సహాయ కార్యదర్శి దయ్యాల మల్లేష్ కోరారు. సోమవారం భువనగిరి మండలం హన్మాపురంలో సైకిల్ యాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు. డ్రగ్స్ గంజాయి, ఆన్‌లైన్ బెట్టింగులు నివారణకు 250 కి.మీ 55 గ్రామాలు కలుపుకొని సైకిల్ యాత్ర ఉంటుందన్నారు.