జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

NRPT: ఊట్కూర్ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడు నారాయణ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. ఈ మేరకు దళిత సంఘాల నాయకులు ఆయనను ఇవాళ సన్మానించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తన 30 ఏళ్ల పదవీకాలంలో ఎంతోమంది విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించానని, వారు నేడు ఉన్నత స్థానాల్లో ఉండటం తనకు ఆనందంగా ఉందని తెలిపారు.