థర్డ్ ఫేజ్ నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్ల పూర్తి: కలెక్టర్
BHNG: జిల్లాలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు జరిగే మూడవ విడత నామినేషన్ స్వీకరణ ప్రక్రియకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3వ తేదీ నుండి 5వ తేదీ వరకు జిల్లాలో 124 గ్రామపంచాయతీలు, 1086 వార్డులకు మూడవ విడత నామినేషన్ ప్రక్రియకి జరుగుతుందన్నారు.