'నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక'
ప్రకాశం: ఒంగోలు కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పి. రాజాబాబు తెలిపారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టర్ మీ కోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్జీదారులు తమ సమస్యలను అర్జీల రూపంలో తెలపవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.