ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్న డీసీసీ
GDWL: ఇందిరమ్మ రాజ్యంలో పేదల సొంతింటి కల నెరవేరుతోందని డీసీసీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ సిరాజ్ అన్నారు. మానవపాడు మండలం మద్దూరులో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మించిన కొత్త ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు.