బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఇంఛార్జ్ కలెక్టర్

బాలికల విద్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఇంఛార్జ్ కలెక్టర్

SRCL: బోయినపల్లి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని శనివారం ఇంఛార్జ్ కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, పోషకాహారం అందించాలని అధికారులను ఆదేశించారు. స్టోర్ రూమ్‌లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలను పరిశీలించి, మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు.