ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీలతో తొలగింపు

ప్రధాన చౌరస్తాలలో ఫ్లెక్సీలతో తొలగింపు

MNCL: జన్నారం మండల కేంద్రంలోని వివిధ చౌరస్తాలలో ఉన్న రాజకీయ ఫ్లెక్సీలను పంచాయతీ సిబ్బంది తొలగించారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం ఉదయం జన్నారంలోని అంగడి బజార్, బస్టాండ్ ఏరియా, ధర్మారం చౌరస్తా ప్రాంతాలలో ఉన్న రాజకీయ పార్టీల ఫ్లెక్సీలను పంచాయతీ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో కార్మికులు తొలగించారు.