వెడ్డింగ్ ఇన్సూరెన్స్.. దేశంలో కొత్త ట్రెండ్

వెడ్డింగ్ ఇన్సూరెన్స్.. దేశంలో కొత్త ట్రెండ్

లైఫ్, హెల్త్, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ గురించి అందరికీ తెలుసు. కానీ దేశంలో కొత్తగా వెడ్డింగ్ ఇన్సూరెన్స్ ట్రెండ్ మొదలైంది. అనుకోని కారణాలతో పెళ్లి ఆగిపోతే వేడుకల కోసం చేసిన ఖర్చు బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ఈ నేపథ్యంలోనే యువత పెళ్లి ఖర్చుని బట్టి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. పెళ్లి ఆగినా చేసిన ఖర్చు ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి వస్తుందని భావిస్తున్నారు.