హోంమంత్రికి జిల్లా పోలీసులు గౌరవ వందనం
ఏలూరు నగరానికి సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి వనిత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలోని అతిధి గృహంలో ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి పూల మొక్క అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆమెకు గౌరవ వందనం సమర్పించారు.