భూ సమస్యల పరిష్కారమే లక్ష్యం: కలెక్టర్ తేజస్

SRPT: భూ సమస్యలు పరిష్కరించే లక్ష్యంగా ప్రభుత్వం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తేజస్ తెలిపారు. గురువారం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామం జడ్.పి.హెచ్.ఎస్ లో భూ భారతి రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రెవెన్యూ సదస్సులు నిర్వహించే గ్రామాల్లో ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు అధికారులు అందుబాటులో ఉంటారన్నారు.