రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి

RR: కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాల కోసం రైతు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని జిల్లా వ్యవసాయ అధికారి ఉష తెలిపారు. మొయినాబాద్ రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉష పాల్గొని మాట్లాడుతూ.. 18-59 సంవత్సరాల మధ్య వయస్సున్న రైతులందరూ రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.5 లక్షల రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.