సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే
పార్వతీపురంలోని 14వ సచివాలయంలో ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఆయన సచివాలయానికి హాజరయ్యే సమయానికి 8 మంది ఉద్యోగులు మాత్రమే అందుబాటులో ఉండటంతో ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని గంటలకు విధులకు హాజరు కావాలని, మీరెవరెవరు ఏ సమయానికి వచ్చారో తెలియజేసే వారం రోజుల హాజరు పట్టిని చూపించాలన్నారు.