జన్నారం రేంజ్ అధికారిగా లక్ష్మీనారాయణ
MNCL: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ జన్నారం రేంజ్ అధికారిగా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. అక్రమ కలప రవాణా, జంతు రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. అక్రమ కలప రవాణా చేసినా, నిలువ ఉంచినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అటవీ సంరక్షణ అందరి బాధ్యత అని అన్నారు.