శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు:తహసీల్దార్

KMR: వినాయక చవితి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని మద్నూర్ తహసీల్దార్ ఎం.డి ముజిప్ కోరారు. రైతు వేదికలో గణేష్ మండలపాల సభ్యులతో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భక్తి వాతావరణంలో ఉత్సవాలు జరపాలని సూచించారు. మండపాల అలంకరణలో జాగ్రత్తలు తీసుకోవాలని SI విజయ్ కొండ తెలిపారు. ఈ సమావేశాల్లో విద్యుత్, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.