విద్యార్థులతో టీచర్ అసభ్య ప్రవర్తన
ప్రకాశం: కురిచేడు(M) కల్లూరు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. 4, 5 తరగతులకు చదువు చెప్పే ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తించడంతో, విద్యార్థులు తమ తల్లిదండ్రులకు తెలిపారు. ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేసి, ఉపాధ్యాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరారు.