రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

GDWL: ఉండవెల్లి స్టేజి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. కరిమద్దుల గ్రామానికి చెందిన మాధవరెడ్డి (28), వరనాథ్ రెడ్డి (30) ఒకే బైక్‌ పై హైదరాబాద్‌కు వెళ్తుండగా ఉండవెల్లి స్టేజీ దాటిన తర్వాత పెట్రోల్ పంప్ సమీపంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.