'అధికారులు సమన్వయంతో పని చేయాలి'
SKLM: బూర్జ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఎమ్మెల్యే కూన రవికుమార్ సోమవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లోని సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.