'తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి'
NLR: భారీ వర్షాల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల అధికారులను ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ హాల్‌లో భారీ వర్షాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్సు సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు ఎటువంటి ఇబ్బందులనైనా ఎదుర్కొనేందుకు సన్నద్ధతతో ఉండాలని సూచించారు.