VIDEO: శ్రీ సీతారామస్వామి శోభాయాత్ర

VIDEO: శ్రీ సీతారామస్వామి శోభాయాత్ర

JGL: వెల్గటూర్ మండలం చెగ్యాం గ్రామంలో శుక్రవారం సీతారాముల శోభాయాత్ర ఘనంగా ప్రారంభమైంది. గ్రామంలోని ప్రతి వాడలో స్వామివారి ఊరేగింపు నిర్వహించి భక్తులకు ఆశీర్వాదాలు అందించారు. భక్తుల నామస్మరణలతో గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు పాల్గొని శోభయాత్రను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం అర్థరాత్రి వరకు భక్తి ఉత్సాహంతో కొనసాగింది.