పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

SRPT: మోతె పోలీస్ స్టేషన్‌ను సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, స్టేషన్ డైరీలను పరిశీలించారు. అనంతరం మండలంలో నమోదవుతున్న నేరాలు, ఫిర్యాదుల పరిష్కార తీరు, మొదలైన వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని సిబ్బందికి సూచించారు.