ఉద్యోగం తీసేశారని బైక్ ఎత్తుకెళ్లాడు..!

ఉద్యోగం తీసేశారని బైక్ ఎత్తుకెళ్లాడు..!

TPT: స్కూటర్ దొంగతనం చేసిన కేసులో ఒకరిని అరెస్ట్ చేసినట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. నెల్లూరు రాపూరు మండలం గండవోలు పంచాయతీకి చెందిన ప్రసాద్ రేణిగుంట సమీపంలోని ఓ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతడిని ఉద్యోగం నుంచి తొలగించడంతో మనస్తాపానికి గురై బయట ఉన్న బైక్ ఎత్తుకెళ్లాడు. బాధితుడు ఫిర్యాదుతో ప్రసాద్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.