తర్లుపాడులోని రైల్వే ట్రాక్‌పై మృతదేహం

ప్రకాశం: తర్లుపాడు పరిధిలోని రైల్వే ట్రాక్‌పై బుధవారం ఓ మృతదేహం వెలుగుచూసింది. రైలులో వెళ్తూ ప్రమాదవశాత్తు జారిపడి చనిపోయాడా, ఆత్మహత్య చేసుకున్నాడా అనేది తెలియలేదు. మృతుడిది గిద్దలూరు మండలం అని సమాచారం. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.