గుండెపోటుతో కాంగ్రెస్ నాయకుడు మృతి
NRPT: నర్వ మండలం రాయికోడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కందుకూరు వెంకటయ్య గుండె పోటుతో బుధవారం ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామ కాంగ్రెస్ నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ ఆధ్వర్యంలో వెంకటయ్యకు నివాళులర్పించారు. అనంతరం ఆయన అంత్యక్రియలకు రూ.5,000 ఆర్థిక సాయం అందజేశారు.